- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సజ్జల మాటల వెనుక కేసీఆర్ హస్తం!
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు, కూతురు కవితపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే తెలంగాణ సీఎం కేసీఆర్ సజ్జల రామకృష్ణారెడ్డి చేత ఉమ్మడి రాష్ట్ర ప్రకటనలు చేయిస్తున్నారని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కొత్త నాటకానికి ఇద్దరు సీఎంలు తెరతీశారని రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ప్రకాష్ రెడ్డి సజ్జల మాటల వెనుక కేసీఆర్ హస్తం ఉందని, కేసీఆర్ ప్రోద్భలంతో సజ్జల ప్రకటనలు చేస్తున్నాడని ఆరోపించారు. ప్రధానమంత్రి గురించి మాట్లాడే స్థాయి కేసీఆర్ కు లేదని, తెలంగాణలో మా పార్టీ అధ్యక్షుడు బండిసంజయ్ ను ఎదుర్కుంటే చాలని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిందని అది కాస్త త్వరలో వీఆర్ఎస్ తీసుకోవడం ఖాయమన్నారు. ఏపీలో ఆర్థిక ఎమర్జెన్సీ నెలకొందని అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆరోపించిన ఆయన.. ఏపీ ఆర్థిక మంత్రి అప్పుల మంత్రిగా మారిపోతున్నాడని ఎద్దేవా చేశారు. తెచ్చిన అప్పులు ఎక్కడ నుంచి తీసుకువస్తున్నారో ఎక్కడ ఖర్చు పెడుతున్నారో కూడా తెలియడం లేదని వాటి ఆ లెక్కల వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అప్పులు చేస్తూ సీఎం జగన్ వ్యక్తిగత ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. 9వ తేదీ వచ్చినా ఏపీలో ఉద్యోగులకు జీతాలు రావడం లేదని ఆరోపించారు.
Also Read....
- Tags
- BJP Telangana