Delhi pollution: ఢిల్లీ కాలుష్యం ఎఫెక్ట్.. 50 శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం

by Shamantha N |
Delhi pollution: ఢిల్లీ కాలుష్యం ఎఫెక్ట్.. 50 శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని నగరం ఢిల్లీలో వాయుకాలుష్యం పెరిగిపోయింది. గాలి నాణ్యత రోజురోజుకీ క్షీణిస్తోంది. గాలి నాణ్యతా సూచీ (AQI) 400లకు పైగా నమోదవుతోంది. కాగా.. ఇలాంటి టైంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50 శాతం ప్రభుత్వ ఉద్యోగులు ఇంటినుంచే పని చేయాలని (Work from home) ఆదేశించింది. కాలుష్య తీవ్రత (Air Pollution in Delhi) పెరుగుతుండటంతోనే వర్క్ ఫ్రం హోం నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ (Gopal Rai) ప్రకటించారు. కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా 50 శాతం ప్రభుత్వ ఉద్యోగులు ఇంటినుంచే పని చేయాలని ఆదేశించింది. ఈ విధానాన్ని అమలు చేసేందుకు సచివాలయ అధికారులతో సమావేశం నిర్వహించనున్నాం’’ అని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌రాయ్‌ సోషల్‌ మీడియా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

పనివేళల్లో మార్పులు

ఢిల్లీలోని మున్సిపాలిటీ పరిధిలోని కార్యాలయాల పనివేళల్లో మార్పులు చేసినట్లు ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ పేర్కొన్నారు. ఢిల్లీ మున్సిపాలిటీ పరిధిలోని కార్యాలయాలు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు పనిచేస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే, ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. కాలుష్యం నేపథ్యంలో సుప్రీంకోర్టులోని ఏ కేసులైనా సరే లాయర్లు వర్చువల్‌ మోడ్‌లో పాల్గొని తమ వాదనలు వినిపించొచ్చని సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా (Justice Sanjiv Khanna) ఇటీవలే పేర్కొన్నారు. వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు కృత్రిమ వర్షం (Cloud seeding) కురిపించేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌రాయ్ (Gopal Rai) కేంద్రాన్ని కూడా కోరారు.

Advertisement

Next Story

Most Viewed