- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగండి.. ఆ సమస్యను తగ్గించుకోండి!!
దిశ, ఫీచర్స్: మానవ జీవనశైలిలో ఆహారం అనేది చాలా ముఖ్యం. కొన్ని ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. దీని వల్ల హార్ట్‌లోని ఆర్టరీ వాల్స్‌లో కొవ్వు ఏర్పడుతుంది. ఇలా జరగడం వల్ల రక్తప్రసరణలో ఇబ్బందులు వస్తాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే, గుండె సమస్యలతో పాటుగా హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల గుండెలో నిల్వ ఉండే చెడు కొవ్వును తగ్గించుకునేందుకు రెగ్యులర్‌గా కొన్ని డ్రింక్స్ తాగాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. రెగ్యూలర్ డైట్‌లో భాగంగా ఆహారంలో కొన్ని మార్పులు చేయడం వల్ల శరీరంలో హై కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించుకోవచ్చు. అవి ఎలాంటి డ్రింక్స్, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ చదివేయండి.
బీట్ రూట్: బీట్ రూట్‌లో నైట్రేట్స్ అనే సహజ రసాయనాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని ప్రతి రోజూ తాగడం వల్ల శరీరంలోని రక్తప్రసరణ మెరుగుపరిచి, బీపిని కంట్రోల్ చేస్తుంది. రక్తపోటును కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. ఇందులోని ఐరన్, ఫోలేట, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
గ్రీన్ టీ: గుండె ఆరోగ్యానికి గ్రీన్ టీ సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిండెంట్లు శరీరంలోని చెడు కొవ్వును తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. అంతేకాకుండా ఉదయాన్నే గ్రీన్ టీ తాగితే ఒత్తిడి తగ్గి రిలాక్స్ అవుతారు.
బాదం పాలు: కాల్షియం కోసం బాదం పాలు ఉపయోగపడతాయి. వీటిలో హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేస్తుంది. బయట దొరికే వాటి కంటే ఇంట్లోనే బాదం పాలు తయారు చేసుకొని తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
దానిమ్మ: దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి, రక్తపోటును నియంత్రిస్తుంది.
ఆరెంజ్ జ్యూస్: ఇందులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. దీనిని ఉదయం ఒక గ్లాసు తాగడం మంచిది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు సహాయపడుతుంది.
పసుపు: పాలలో పసుపు వేసుకొని తాగడం వల్ల ఇమ్యూనిటీని పెంచి, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. కొబ్బరిపాలలో కూడా చిటికెడు పసుపు, మిరియాలు వేసుకొని తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.