- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పోటాపోటీగా పాల్వాయి జయంతి వేడుకలు..
దిశ, చండూరు : మాజీ మంత్రి, దివంగత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి జయంతి వేడుకలను బుధవారం చండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీల నాయకులు ఘనంగా నిర్వహించారు. చండూరు చౌరస్తాలోని ఆయన విగ్రహానికి మొదట ఆయన కుమారులు పాల్వాయి శ్రవణ్ కుమార్ రెడ్డి, పాల్వాయి శంతన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గోవర్ధన్ రెడ్డి కూతురు బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళిలు అర్పించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు వేసిన పూలదండలను బీ ఆర్ ఎస్ నాయకులు తొలగించటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యంతరం తెలుపగ ఇరు పార్టీల నాయకుల మధ్య కొద్ది సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా పాల్వాయి కుటుంబంలో గత కొంత కాలంగా ఆస్తి తగాదాలు నెలకొన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు వేరువేరుగా నివాళులు అర్పించడం సర్వత్రా చర్చనీయాంశమైంది . కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేష్,మహమ్మద్ ఘని, కల్లేట్ల మారయ్య, పన్నాలా లింగయ్య, రామ్మూర్తి బోయపల్లి స్వామి, ఇరిగి మారయ్య, పంతంగి గిరి,నల్ల స్వామి,బి ఆర్ ఎస్ నాయకులు మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, పట్టణ అధ్యక్షుడు సతీష్,ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు తెలుకుంట్ల చంద్రశేఖర్, జానయ్య ,సుదర్శన్, పాల్వాయి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.