- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనసేనకు బీజేపీ బిగ్ ట్విస్ట్.. ఆ స్థానాల్లో కూడా అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ..!
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల సమరంలో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల తొలివిడత జాబితాలు వెల్లడయ్యాయి. దీంతో మెజార్టీ స్థానాల్లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనేది స్పష్టత రాగా.. కొన్ని పార్టీల మధ్య పొత్తులపై పీటముడి వీడటం లేదు. ఈ క్రమలో తెలంగాణలో పోటీ చేసి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న జనసేనకు బీజేపీ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. రాబోయే ఎన్నికల్లో తాము పోటీలో ఉంటామని పోటీ చేయబోయే 32 స్థానాల పేర్లను ఇప్పటికే ప్రకటించగా ఈ స్థానాల్లో తాజాగా బీజేపీ అభ్యర్థులను ప్రకటించడం చర్చనీయాశంగా మారింది. దీంతో బీజేపీ, జనసేన మధ్య పొత్తు వ్యవహారంలో అసలేం ఏం జరుగుతోందనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.
జనసేన స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు:
తెలంగాణలో ఈసారి జనసేన పోటీ చేయాల్సిందే అని ఆ పార్టీ అధినేతపై నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. పోటీ విషంలో వెనక్కి తగ్గకూడదని ఇప్పటికే పవన్‌కు తేల్చి చెప్పారు. దీంతో తెలంగాణలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయబోతున్నదనే ప్రచారం తెరమీదకు రాగా ఇంతలో ఈ పొత్తుల ట్రాక్ పైకి బీజేపీ వచ్చింది. ఐదు రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత కె.లక్ష్మణ్‌లు భేటీ అయ్యారు. ఈ భేటీతో ఇరు పార్టీలు కలిసి పని చేస్తాయనే ఊహాగానాలు వినిపించాయి.
అయితే జనసేన పోటీ చేస్తామని ప్రకటించిన వాటిలో అనూహ్యంగా 10 చోట్ల నిన్న బీజేపీ విడుదల చేసిన ఫస్ట్ లిస్ట్‌లో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. 52 మందితో వెల్లడించిన బీజేపీ ఫస్ట్ లిస్ట్‌లో ఖానాపూర్, జగిత్యాల, రామగుండం, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్, స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, ఇల్లందు స్థానాలకు క్యాండిడేట్లు అనౌన్స్ చేయగా.. ఇక్కడ తమ అభ్యర్థులు బరిలో ఉంటారని జనసేన ఇదివరకే ప్రకటన చేసింది. దీంతో పవన్ కళ్యాణ్, కిషన్ రెడ్డి మధ్య ఏం అసలేం చర్చ జరిగిందనేది ఉత్కంఠ రేపుతోంది.
కన్ఫ్యూజన్‌లో క్యాడర్:
బీజేపీ తొలి జాబితాతో ఇరు పార్టీల క్యాడర్ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఈసారి తాము పోటీలో ఉంటామా లేదా అనేదానిపై జనసైనికుల్లో గందరగోళం నెలకొంది. సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మరో సీనియర్ నేత అయిన లక్ష్మణలు పవన్ వద్దకు వచ్చి చర్చలు జరిపిన తర్వాత కూడా తాము పోటీ చేస్తామన్న స్థానాలకు అభ్యర్థులకు ఖరారు చేయడం వెనుక మతలబు ఏంటి? పొత్తు ఉన్నట్టా లేనట్టా? అని చర్చించుకుంటున్నారు. మరో వైపు ఇరు పార్టీల మధ్య పొత్తు వ్యవహారం రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేపుతోంది. అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ పొత్తు ధర్మం పాటించలేదా? పవన్‌తో కలిసి వెళ్తే మొదటికే నష్టం తప్పదనే తమ దారిలో తాము వెళ్లాలని చూస్తోందా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఫస్ట్ లిస్ట్‌లోనే పది స్థానాల్లో జనసేనకు బీజేపీ చెక్ పెడితే రెండో లిస్ట్ ఆ షాక్ కంటిన్యూ అవుతుందా ఆలోపు ఏదైనా పరిణామాలు మారుతాయా అనేది వేచి చూడాలి. ఇక ఏపీలో కలిసి వెళ్తున్నట్లుగానే తెలంగాణలోనూ టీడీపీ, జనసేన కలిసి పని చేసే దిశగా ఆలోచనలు ముందడుగు పడతాయా అనేది కూడా ఇంట్రెస్టింగ్‌గా మారింది. మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ భేటీ తర్వాత తెలంగాణ పొత్తులపై కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో పొత్తుల ఎలా ఉండబోతున్నాయనేది ఇంట్రెస్టింగ్ గా మారుతోంది.
- Tags
- janasena party