BL Santosh :తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉంది: బీఎల్ సంతోష్

by Ramesh N |
BL Santosh :తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉంది: బీఎల్ సంతోష్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో తమ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ వ్యాఖ్యానించారు. ఆదివారం బీజేపీ కార్యాలయానికి బీఎల్ సంతోష్ వచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శులతో బీజేపీ అగ్రనేత సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ పరిస్థితి, నేతల మధ్య సమన్వయంపై కమలం నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలు, కార్యకర్తలు కలి‌సి కట్టుగా పని చేయాలని సూచించారు.

అందరినీ కలుపుకొని పోయి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలపై పోరాటం చేయాలని, ప్రజలకు అండగా ఉండాలని చెప్పారు. పార్టీ బలహీనంగా ఉన్న చోట మరింత కష్టపడి పని చేయాలన్నారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించాలని ఆదేశించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో గోషమహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో బీఎల్ సంతోష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలపై చర్చించారు. జాతీయ నాయకత్వం ఇచ్చిన కార్యక్రమాల అమలుపై ఆరా తీశారు.

Advertisement

Next Story