BJP: బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్.. ఆయన ఫస్ట్ రియాక్షన్ ఇదే!

by Shiva |
BJP: బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్.. ఆయన ఫస్ట్ రియాక్షన్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఇవాళ బీజేపీలో చేరారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. కాగా, ఆరూరి రమేశ్ వరంగల్ పార్లమెంట్ సీటును ఆశిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంగా అమిత్ షాను కలిసి ఆ సీటులో కట్చీఫ్ కూడా వేశారు. ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానం అయిన వరంగల్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆరూరి పోటీలో ఉండనున్నారు. పార్టీలో చేరిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఎన్నికై గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు.

ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు అప్పటి టీఆర్ఎస్‌‌ పార్టీలో చేరి స్వరాష్ట్రాన్ని సాకారం చేసుకున్నామని తెలిపారు. ఇన్నాళ్లు ఎమ్మెల్యేగా రాష్ట్రంలో కోసం సేవ చేశానని, ఇక ముందు దేశం కోసం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో పని చేసేందుకు బీజేపీలో చేరుతున్నట్లుగా పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అర్థిక రంగంలో శక్తివంతమైన దేశంగా ఎదిగిందని తెలిపారు. ఏళ్లుగా నలుగుతున్న అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారని తెలిపారు. ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ కాబోతోందని అన్నారు. ఓ సామాన్య కార్యకర్తగానే తాను బీజేపీలోకి వస్తున్నట్లు రమేష్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed