- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్,డీకే శివ కుమార్ ఇక బ్యాగులు ప్యాక్ చేసుకోండి.. కర్ణాటక బీజేపీ కౌంటర్
దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఇద్దరు కూడా తమ బ్యాగులు ప్యాక్ చేసుకుని రెడీగా ఉండాలని కర్ణాటక బీజేపీ సలహా ఇచ్చింది. బెంగళూరులో ఉన్నా ఇబ్బందులు పడుతున్నామంటూ ఓ కంపెనీ చేసిన ట్వీట్ నెట్టింట చర్చనీయాంశమైంది. దీనిపై కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు స్పందిస్తూ.. 2023 డిసెంబర్ నాటికి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని, అప్పుడు బెంగళూరుకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఆయన ట్వీట్ చేశారు. దానికి కేటీఆర్ రీట్వీట్ చేస్తూ తానూ సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. హలాల్, హిజాబ్‌పై కాకుండా మౌళికసదుపాయాలు, ఐటీ, బయో టెక్నాలజీ రంగాలపై దృష్టి సారిద్దామని పిలుపునిచ్చారు. దీంతో మంత్రి కేటీఆర్ ట్వీట్ పై నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక బీజేపీ పార్టీ ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేసింది. '' 2023లో, మీ స్నేహితులు ఇద్దరూ బ్యాగ్ ప్యాక్ చేసుకొని ఏ ప్రదేశానికి వెళ్లాలో వెళ్లిపోవచ్చని తెలిపారు. 'బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల' కర్ణాటక రాష్ట్రానికి మరింత కీర్తిని పునరుద్ధరిస్తోందని, తెలంగాణకు మరింత పురోగతి కల్పిస్తామని ఆయన జోష్యం చెప్పారు.