- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో 10 స్థానాలకు BJP అభ్యర్థులు ఖరారు!
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలను తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. కీలక నేతలంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి సత్తాచాటి పరువు నిలుపుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పది స్థానాలకు ఆశావహుల జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రేపు ఢిల్లీ వేదికగా జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ భేటీకి ఏపీ నేతలతో పాటు తెలంగాణ నేతలు కూడా హాజరు కాబోతున్నారు. సిట్టింగులు, మరో నాలుగైదు స్థానాల అభ్యర్థులు రేపు ఖరారు కానున్నారు. మొత్తం 17 స్థానాల్లో మల్కాజ్‌గిరి స్థానానికి పోటీ ఎక్కువ ఉన్నట్లు సమాచారం.
మరోవైపు తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసేందుకే బీజేపీ మొగ్గుచూపింది. బీఆర్ఎస్‌తో పొత్తు ఉందంటూ జరుగుతున్న ప్రచారానికి కిషన్ రెడ్డి ఇప్పటికే తెరదించారు. ఈ క్రమంలోనే విజయ సంకల్ప యాత్రలను ప్రారంభించి రాష్ట్రాన్ని చుట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీకి సానుకూలత పెరిగిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధిరాకంలో ఉన్న దేశంలో మోడీ ఉండాలనే నిదానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అందుకే దాదాపు 12 స్థానాలపై కీలకంగా ఫోకస్ చేస్తున్నారు. మరి ఎంతమేర సక్సెస్ అవుతారో చూడాలి.