BJP: దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా బండి సంజయ్ ఘన నివాళి

by Ramesh Goud |
BJP: దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా బండి సంజయ్ ఘన నివాళి
X

దిశ, డైనమిక్ బ్యూరో: పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. దీనిపై ఆయన.. "అట్టడుగు వర్గాల అభివృద్దే ధ్యేయంగా.. ఆధ్యాత్మికతనే ఆలంబనగా.. మనిషి మనీషిగా ఎదుగడమే లక్ష్యంగా.. ఏకాత్మతా మానవతా వాదాన్ని ప్రబోధించిన మహర్షి అని అన్నారు. ఇక విదేశి విధానాలపై మన దేశం ఆధారపడకుండా స్వదేశీయ భావనలతో స్వాలంబన దిశగా సాగడమే నిజమైన అభివృద్ధి అని సూచించిన మార్గదర్శి అని తెలిపారు. భారతీయ జన సంఘ్ సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నమస్సుమాంజలులు" అని కేంద్ర మంత్రి ఎక్స్ లో రాసుకొచ్చారు. కాగా ఉత్తర ప్రదేశ్ లో పుట్టిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంస్థతో పాటు జన సంఘ్ పార్టీకి కూడా అధ్యక్షులుగా పని చేశారు.

Next Story

Most Viewed