Family Survey : సమగ్ర కుటుంబ సర్వేలో ఎన్యూమరేటర్లకు చేదు అనుభవం.. కుక్కలను వదిలిన వ్యక్తులు!

by Ramesh N |
Family Survey : సమగ్ర కుటుంబ సర్వేలో ఎన్యూమరేటర్లకు చేదు అనుభవం.. కుక్కలను వదిలిన వ్యక్తులు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే (comprehensive family survey) ప్రారంభమైన విషయం తెలిసిందే. సర్వేలో భాగంగా ఇంటింటికి వెళ్తున్న (ఎన్యూమరేటర్లు) ప్రభుత్వ ఉపాధ్యాయులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే (Hyderabad) హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఒక ఇంటికి వెళ్లిన ఇద్దరు మహిళా ఎన్యుమరేటర్‌లపై ఇంటి యజమానులు కుక్కలను వదిలి దుర్భాషలాడినట్లు ఆరోపణలు వచ్చాయి.

బంజారా హిల్స్ లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న అపురూప, రమ్యశ్రీ.. అరోరా కాలనీలో కుటుంబ వివరాలు నమోదు చేయడానికి ఓ ఇంట్లోకి వెళ్లారు. అయితే వారిపై ఇంటి యజమాని దుర్భాషలాడి, వారిపైకి కుక్కలను వదిలాడని.. భయాందోళనకు గురైన వారు అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారడంతో ఈ ఘటనపై దర్యాప్తు చేసి.. కుక్కలు వదిలిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులకు ఎక్స్ వేదికగా ట్యాగ్ చేశారు.

Advertisement

Next Story