BRSకు మరో బిగ్ షాక్.. కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ ఘన విజయం

by Rajesh |
BRSకు మరో బిగ్ షాక్.. కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ నివేదితపై గెలుపొందారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 65కు చేరగా బీఆర్ఎస్ బలం 38కి పడిపోయినట్లు అయింది. కాగా, తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ జీరో స్థానాలకే పరిమితం కానుంది. అన్ని స్థానాల్లో కారు పార్టీ మూడో స్థానంలోనే ఉంది. మెదక్‌పై బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్నా అక్కడ సైతం రఘునందన్ రావు భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు.

Advertisement

Next Story