- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈటలకు బిగ్ షాక్! ‘కీ’ పోస్ట్ లీకులపై సీనియర్ల రహస్య మీటింగ్
దిశ, తెలంగాణ బ్యూరో: ఈటలకు బీజేపీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ పోస్టు ఇస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీలోని తెలంగాణ ఉద్యమకారులు రహస్యంగా సమవేశమయ్యారు. రాజేందర్ కు కీలక పదవి ఇవ్వడాన్ని వాళ్లంతా తీవ్రంగా వ్యతిరేకించారు. ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లి రాజకీయాలు చేయడం ఏమిటని వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలు ప్రస్తుతం రాష్ట్ర బీజేపీలో హాట్ టాపిక్‌గా మారాయి.
బీజేపీ రాష్ట్రశాఖలో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా పనిచేసిన తమను కాదని ఈటలకు ప్రయారిటీ ఇస్తున్నట్లుగా వస్తున్న వార్తలను వీరు ఖండించారు. మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, విజయశాంతి, డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, వివేక్, రవీంద్రనాయక్, ఉద్యోగ సంఘాల నేత విఠల్, దేవయ్య తదితరులు ఈ సీక్రెట్ సమావేశంలో పాల్గొన్నారు.
సీనియర్ నేతల ఫైర్
పార్టీలో సీనియర్లుగా ఉన్న తమకు అవకాశం ఎందుకు ఇవ్వడంలేదన్న అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు ఈటలకు కీలక బాధ్యతలు అప్పజెప్పడంపై పెదవి విరిచారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్‌లో కార్యకలాపాలపై దృష్టి పెడితే ఈటల రాజేందర్ మాత్రం ఢిల్లీ వెళ్లి పాలిటిక్స్ చేయడాన్ని వీరంతా తప్పుపడుతున్నారు. పార్టీలోని అంతర్గత అంశాలు మీడియాకు ఎలా పొక్కుతున్నాయనే ప్రశ్నను లేవనెత్తారు. ఈటల ఉద్దేశపూర్వకంగానే ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి లీకులు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో స్టేట్ యూనిట్‌లో చోటుచేసుకుంటున్న తాజా అలజడి పార్టీకి ఇబ్బందికరంగా మారాయని అభిప్రాయపడినట్లు తెలిసింది.