మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు బిగ్ షాక్.. ఆ పాత కేసు రీ ఓపెన్

by Rajesh |
మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు బిగ్ షాక్.. ఆ పాత కేసు రీ ఓపెన్
X

దిశ, వెబ్‌డెస్క్: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ లో హిట్ అండ్ రన్ కేసును పోలీసు రీ ఓపెన్ చేశారు. 2022 మార్చి 17న జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45లో యాక్సిడెంట్ జరిగగా.. ఈ ప్రమాదంలో రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారుపై.. ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ ఉన్నట్లు గుర్తించారు. తన కారు కాదని, ఎమ్మెల్యే స్టిక్కర్‌ను స్నేహితుడికి ఇచ్చినట్లు గతంలో షకీల్ పోలీసులకు చెప్పారు. అయితే పోలీసులు మరోసారి కేసును రీఓపెన్ చేయడంతో తదుపరి ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది.

Advertisement

Next Story