ఎట్టకేలకు ఫలించిన ప్రయత్నాలు.. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బిగ్ రిలీఫ్..!

by Satheesh |   ( Updated:2024-01-29 06:29:09.0  )
ఎట్టకేలకు ఫలించిన ప్రయత్నాలు.. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బిగ్ రిలీఫ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: అధికారం కోల్పోయి ఓటమి బాధలో ఉన్న బీఆర్ఎస్ అధిష్టానానికి కౌన్సిలర్లు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.. మరి కొందరు సైతం అదేబాటలో ఉన్నారు. నల్లగొండ, కోదాడ, ఆర్మూర్, బెల్లంపల్లి, నుస్పూర్ మున్సిపాలిటీలు ఇప్పటికే బీఆర్ఎస్ చేజారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సొంత ఇలాకా సిరిసిల్లలో కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి సిద్ధం కావడం బీఆర్ఎస్‌తో పాటు, రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఏకంగా కేటీఆర్ సొంత ఇలాకాలోనే బీఆర్ఎస్ కౌన్సిలర్లు అధిష్టానం మాటను లెక్క చేయకుండా అవిశ్వాసానికి రెడీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమైన 12 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇప్పటికే క్యాంప్‌కు తరలివెళ్లగా.. మరో 8 మంది కౌన్సిలర్లు సైతం వెళ్లనున్నట్లు వార్తలు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన కేటీఆర్ రంగంలోకి దిగి కౌన్సిలర్లను బుజ్జగించినట్లు తెలుస్తోంది. కౌన్సిలర్లు కూల్ కావడంతో సిరిసిల్ల మున్సిపల్ అవిశ్వాసానికి బ్రేక్ పడింది. అసంతృప్తి కౌన్సిలర్లు ఆదివారం అర్థరాత్రి క్యాంప్ నుండి తిరిగొచ్చారు.

16 మంది కౌన్సిలర్లు అసంతృప్తి వీడటంతో సిరిసిల్ల మున్సిపాలిటీ అవిశ్వాసానికి తెరపడింది. కౌన్సిలర్లు అలక వీడటంతో బీఆఆర్ఎస్ అవిశ్వాసం గండం నుండి గట్టెక్కింది. ఎట్టకేలకు బీఆర్ఎస్ నాయకుల ప్రయత్నాలు ఫలించడంతో మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగ్ రిలీఫ్ దొరికింది. మరోవైపు సిరిసిల్ల మున్సిపల్ పరిణామాలపై కేటీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, సిరిసిల్ల మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్‌కు 33, బీజేపీ 3, కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు కౌన్సిలర్లు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed