నాలుగు వారాల్లో వారి పదవులు ఊస్ట్ అవ్వడం ఖాయం: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-09-09 11:03:15.0  )
నాలుగు వారాల్లో వారి పదవులు ఊస్ట్ అవ్వడం ఖాయం: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు (Telangana High Court) సంచలన తీర్పును వెల్లడించింది. ఈ మేరకు నాలుగు వారాల్లోగా సదరు ఎమ్మెల్యేలపై అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పుపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) స్పందించారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీకి చేర్చుకునేందుకు కుట్రలు చేసిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి కోర్టు తీర్పు ఓ చెంపపెట్టులాంటిదని అన్నారు. సరిగ్గా నాలుగు వారాల తరువాత దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు పదవులు ఊస్ట్ అవ్వడం ఖాయమని ఎద్దేవా చేశారు. అదేవిధంగా ఇప్పటి వరకు పార్టీలు మారిన ఎమ్మెల్యే పరిస్థితి అంతేనని.. ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని అన్నారు. తమకు న్యాయస్థానాలపై పూర్తి నమ్మకం ఉందని మొదటి నుంచి తాను చాలా వేదికలపై ఇదే విషయం చెప్పానని గుర్తు చేశారు. నిత్యం రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ అదే రాజ్యాంగాన్ని తెలంగాణలో ఫిరాయింపుల పేరుతో ఖూని చేశారని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story