- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Big News: బతుకమ్మ చీరలపై కేటీఆర్ సంచలన ట్వీట్.. సర్కార్ మరో చరమగీతం పలికిందని ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌కు, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీకి మాటల యుద్ధం కొనసాగుతోంది. గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆరు గ్యారంటీలు, 420 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారంటూ బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. ‘చేనేత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో చరమగీతం మోగించింది. పేద చేనేత కార్మికులను కష్టాల్లోకి నెట్టి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేళ్లుగా కొనసాగించిన బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రతి సంవత్సరం, తమప్రభుత్వం దసరా, రంజాన్, క్రిస్మస్ సందర్భంగా సుమారు 1 కోటి చీరలను పంపిణీ చేస్తుంది. దీని బడ్జెట్ ఏడాదికి రూ.350 కోట్లు. ఈ పథకం చేనేత కార్మికులు, అనుబంధ కార్మికులు, ఇతరులకు జీవనోపాధిని కల్పించింది. పండుగ సమయంలో పేద మహిళలకు ఆనందం కలిగించింది. ఇప్పటికే గత కొన్ని నెలలుగా 10 మందికి పైగా నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల ఉత్పత్తిని నిలిపివేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అనాలోచిత నిర్ణయాన్ని పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నా అంటూ కేటీఆర్ పేపర్ క్లిప్పింగ్‌ను షేర్ చేశారు.