- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BIG BREAKING: కవితకు మరో బిగ్ షాక్..! ఈడీ, సీబీఐలకు సుప్రీం కోర్టు నోటీసులు
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ.. శుక్రవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు ఇవాళ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆమె పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ మేరకు కవితకు మద్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మద్యంతర బెయిల్ మంజూరు చేయలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రతివాదులైన కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలకు కౌంటర్ దాఖలు చేయాలంటూ నోటీసులు జారీ చేసింది.
ఈ క్రమంలో కవిత తరఫు లాయర్ రోహత్గీ దర్యాప్తు సంస్థలకు నోటీసులు అందజేస్తామని, కేసును వెంటనే విచారణ చేపట్టాలని, లేని పక్షంలో సోమవారం విచారించాలని ధర్మాసనాన్ని రిక్వెస్ట్ చేశారు. గత ఐదు నెలలుగా కవిత జైల్లోనే ఉన్నారని కోర్టుకు తెలిపారు. సీబీఐ, ఈడీ కేసుల్లోనూ ఛార్జిషీట్లు దాఖలయ్యాయని గుర్తు చేశారు. ఇప్పటి వరకు కేసులో 493 మంది సాక్షుల విచారణ జరగిందని, మహిళగా సెక్షన్ - 45 ప్రకారం.. కవిత మద్యంతర బెయిల్‌కు అర్హురాలని కవిత తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఆయన వాదనలను తోసిపుచ్చుతూ ఈ నెల 20న కేసుపై తిరిగి విచారణ చేపడతామని ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. కాగా, కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేయగా.. జ్యుడీషియల్ రిమాండ్‌లో అప్పటి నుంచి ఆమె తీహార్ జెల్లోనే ఉంటున్నారు.