ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే రైతులకు బిగ్ రిలీఫ్.. గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి తుమ్మల

by Satheesh |
ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే రైతులకు బిగ్ రిలీఫ్.. గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి తుమ్మల
X

దిశ, వెబ్‌డెస్క్: రైతులకు పంట పెట్టుబడి సాయం కింద నగదు అందించే రైతు భరోసా స్కీమ్ గైడ్‌లైన్స్ రూపొందించేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ విధివిధానాల రూప కల్పన కోసం జిల్లాల పర్యటన చేసి రైతులు, మేధావులు ఇతరుల నుండి అభిప్రాయాలు స్వీకరిస్తుంది. అయితే, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారు రైతు భరోసా స్కీమ్‌కు అనర్హులని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు క్లారిటీ ఇచ్చారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారికి రైతు భరోసా ఇవ్వరని జరుగుతోన్న ప్రచారమంతా అవాస్తవమని కొట్టి పారేశారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన రైతులకు రైతు భరోసా స్కీమ్‌కు అనర్హులనేది ఫేక్ ప్రచారమన్నారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం వేరు, ఐటీ చెల్లించడం వేరన్నారు. పిల్లల చదువులు, ఇతరత్రా పనుల కోసం రైతాంగం ఐటీ రిటర్న్స్ దరఖాస్తు చేసుకుంటారని, అటువంటి రైతులకు ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేశారు

Advertisement

Next Story

Most Viewed