- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌కు భట్టి లేఖ.. కీలక స్కీమ్ ప్రారంభించాలని డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వెంటనే బీసీ బంధును ఏర్పాటు చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదిన్నర సంవత్సరాలు కావస్తున్నా.. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. తాను చేస్తున్న పాదయాత్రలో అనేక గ్రామాల్లో పర్యటించినప్పుడు ఇది కళ్లకు కట్టినట్లు కనబడుతోందని వివరించారు. "ముఖ్యంగా బడుగు బలహీనవర్గాలు, బహుజనులు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతమన్నారు.
గత ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో బడుగు బలహీనవర్గాల వారికి చెందాల్సిన సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. తమ పట్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం వివక్షత చూపుతుందన్నారు. 2014 లో రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుండి బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. ఏరు దాటక తెప్ప తగలేసినట్లు 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల అభివృద్ధికి కేసీఆర్ చేసిన వాగ్ధానాలన్నీ తుంగలో తొక్కారన్నారు. బీసీలను నిట్టనిలువునా మోసం చేసిన ఘనత మీకే దక్కుతుందన్నారు.
రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిందన్నారు. కులాలవారీ జనగణన చేసి వివరాలు సేకరించారని తెలిపారు. దీని ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలు ప్రభుత్వం వద్ద ఉన్నా బయటకు ప్రకటించడం లేదన్నారు. ఇదంతా జనాభా నిష్పత్తికి అనుగుణంగా నిధులు, నియామకాలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమే అన్నారు.
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి బీసీలకు 2.3 శాతం మాత్రమే నిధులు కేటాయిస్తూ చేతులు దులుపుకుంటున్నారని భట్టి ఫైర్ అయ్యారు. స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను 18 శాతానికి కుదించారన్నారు. 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు రాష్ట్ర కేబినెట్‌లో మూడు పదవులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ఈ చర్యలతో మీరు బీసీలను అణగదొక్కుతున్నారని అర్థం అవుతోందని" లేఖలో భట్టి పేర్కొన్నారు.