- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియాంక గాంధీకి అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనున్న భట్టి
దిశ, డైనమిక్ బ్యూరో: ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఈ నెల 8న తెలంగాణకు రానున్న నేపథ్యంలో ఆమెకు బహుకరించేందుకు పోచంపల్లి చీరలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొనుగోలు చేశారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా 51వ రోజు శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంలో చేనేత కార్మికులతో సమావేశమైన సీఎల్పీ నేత భట్టి చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి బీఆర్ఎస్ పరిపాలనలో చేనేతకు అందుతున్న ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేక చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, మూడేళ్లుగా వారికి ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిహారం కూడా అందడం లేదని చేనేత కార్మికుల ఆవేదన వ్యక్తం చేశారని వెల్లడించారు. చేనేత కార్మికులకు కాంగ్రెస్ పార్టీకి విడదీయని అనుబంధం ఉందన్నారు. అందుకు మూడు రంగుల జెండాలో మధ్యలో ఉన్న చరకానే దీనికి సజీవ సాక్ష్యం అని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పోగొట్టడానికి ఉపాధి అవకాశాలను మెరుగు పరచుకోవడానికి చేనేత స్వయం ఉపాధి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని, దీని ద్వారా నిరుద్యోగ సమస్యను కొంతమేరకు తగ్గించవచ్చన్నారు.
Also Read..