అయోధ్య ఉద్యమ రథసారథి అద్వానీకి శుభాకాంక్షలు: బండి సంజయ్

by Mahesh |   ( Updated:2024-02-04 14:39:37.0  )
అయోధ్య ఉద్యమ రథసారథి అద్వానీకి శుభాకాంక్షలు: బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: శనివారం బీజేపీ నేత ఎల్‌కే అద్వానీ గారికి భారత ప్రభుత్వం అత్యున్నతమైన భారత రత్న పురస్కారాన్ని ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, రాజకీయ నాయకులు అద్వానీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బండి సంజయ్ తన యుక్త వయసులో అద్వానీతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ఇలా రాసుకొచ్చాడు. జాతిని జాగృతం చేసిన అభినవ పార్థుడు, జాతీయ యవనికపై తల పండిన రాజకీయ యోధుడు, అయోధ్య ఉద్యమ రథసారథి.. హిందూ సమాజ సంఘటిత వారధి నా లాంటి కార్యకర్తలెందరినో నడిపించిన మార్గదర్శి, మాజీ ఉప ప్రధానమంత్రి శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారికి భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed