- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ బిర్యానీతో పాటు బయో ఫార్మాకు కూడా ఫేమస్!.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ బిర్యానీతో పాటు బయో ఫార్మాకు కూడా ప్రసిద్ది చెందిందని, దేశంలో 35 శాతం ఫార్మా ఉత్పత్తులు తెలంగాణ నుంచే ఎగుమతి అవుతున్నాయని, ఇది మన రాష్ట్రానికే గర్వకారణం అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న 73వ ఫార్మా కాంగ్రెస్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. దేశంలో 35 శాతం ఫార్మా ఉత్పత్తులు తెలంగాణ నుంచే సప్లై అవుతున్నాయని, ప్రతి ఏటా 50వేల కోట్ల విలువైన మందులు ఎగుమతి చేస్తున్నామని, ఇది మన రాష్ట్రానికే గర్వకారణం అని అన్నారు.
మాది పారిశ్రామిక ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని, 24 గంటలు మా క్యాబినెట్ అందుబాటులో ఉంటుందని, రాష్ట్రం లో ఏ పరిశ్రమకు ఎలాంటి సమస్య రానివ్వమని హామీ ఇచ్చారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్యలో ఫార్మా క్లస్టర్లు నిర్మించి ఈ పరిశ్రమను ప్రోత్సహిస్తామని చెప్పారు. పరిశ్రమలకు విద్యుత్తు, నీటి సమస్య లేదని భట్టి స్పష్టం చేశారు. అంతేగాక త్వరలో రాష్ట్రంలో కొత్త విద్యుత్ పాలసీని తీసుకురాబోతున్నమని, గ్రీన్ ఎనర్జీ, మిగులు విద్యుత్ అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశామని శుభవార్త చెప్పారు. ఇక ఆరోగ్య సంరక్షణకు ఫార్మా పరిశ్రమ వెన్నుముక లాంటిదని, రోగుల భద్రత, ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో ఫార్మ రంగం కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
అత్యధిక నాణ్యతతో జనరిక్ మెడిసిన్ ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తూ.. తెలంగాణ గుర్తింపు సాధించిందని తెలిపారు. కరోనా కాలంలో ఫార్మాసిస్టులు అసమానమైన చురుకుదనం ప్రదర్శించి, అవిశ్రాంతంగా శ్రమించారని కొనియాడారు. ఇప్పుడు బిర్యానీతో పాటు బయో ఫార్మకు హైద్రాబాద్ ప్రసిద్ధి గావించిందని, సుగంధ ద్రవ్యాలు ఎగుమతి చేసే స్థాయి నుంచి జీవితాలను కాపాడే మందుల సరఫరా దశకు తెలంగాణ రాష్ట్రం చేరుకుందని సంతోషం వ్యక్తం చేశారు. అందరికీ ఆరోగ్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తే దృఢమైన ప్రపంచాన్ని నిర్మించగలమని భట్టి విక్రమార్క సూచించారు.