- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రేపు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు

దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మొత్తం మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బీసీలకు 42 శాతం విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయనున్నారు. ఇందుకు అవసరమైన బిల్లులను సభలో ప్రవేశపెడతారు. అనంతరం బిల్లులను సభ ఆమోదిస్తుంది. కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా బిల్లును ప్రవేశపెడుతున్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో బాగంగా ఇంటింటి నుంచి సమాచారాన్ని సేకరించారు. బీసీలు మొత్తం 56 శాతం ఉన్నట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా 42 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. ఇందుకు చట్టబద్ద కల్పించనుంది. కాంగ్రెస్ పార్టీ బీసీ బిల్లును ప్రతిష్ఠాత్మకంగా బావిస్తుంది. ఈ మూడు బిల్లులతో పాటుగా తిరుమల తరహాలో యాదాద్రి బోర్డు ఏర్పాటు, తెలుగు యూనివర్సిటికి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు పెట్టే బిల్లుకు అసెంబ్లీ ఆమోదించనుంది. శాసనమండలిలో కేవలం ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నారు.
ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు...
సోమవారం ఉభయ సభలు ప్రారంభంకాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా మెస్ డైట్ ఛార్జిలు పెంపు, జాతీయ రహదారుల సమీపంలో ట్రామా కేర్ కేంద్రాలు ఏర్పాటు, విదేశి ఉపకార వేతనాల చెల్లింపులో జాప్యం, కామారెడ్డి జిల్లాలో పర్యాటక కేంద్రాల అభివృద్ధి, దేవాలయ పర్యాటకం, పర్యావరణ పర్యాటకాలకు ప్రోత్సహం, శంకరపట్నం మండలంలో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం, ప్రభుత్వ వెబ్ సైట్లలో జీవోలు, సర్క్యులర్లు, హెచ్ఎండీఏ భూముల తాకట్టు, మహబూబాబాద్ పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు కోసం నిధులు , టీ ప్రైడ్ కింద రాయితీలు గురించి ప్రశ్నలు సభ్యులు అడిగారు.
శాసనమండలిలో ప్రభుత్వ పథకాల అమలు, కళ్యాణమస్తు పథకం, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు గురించి , సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి, రంగారెడ్డి జిల్లాలో ఫార్మా సిటీ కోసం భూ సేకరణ, రాష్ట్రంలో విత్తనోత్పత్తి, వరి ధాన్యానికి బోనస్, తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, వరి ధాన్యం సేకరణ, తుమ్మిడి హట్టి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టకు నీటి సరఫరా గురించి మండలి సభ్యులు ప్రశ్నలు అడిగారు. వీటికి మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు.