BC గురుకులాల ప్రవేశ పరీక్ష.. విద్యార్థులకు భట్టు మల్లయ్య బిగ్ అప్డేట్

by Satheesh |   ( Updated:2023-04-25 16:37:52.0  )
BC గురుకులాల ప్రవేశ పరీక్ష.. విద్యార్థులకు భట్టు మల్లయ్య బిగ్ అప్డేట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ గురుకులాల్లో ఇంటర్, డిగ్రీ కోర్సుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్లను వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు అని మహాత్మా జ్యోతిభా పూలే గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీసీ గురుకుల విద్యాసంస్థల http://mjptbcwreis.telangana.gov.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 30న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు పరీక్ష జరుగుతుందని ఆయన తెలిపారు. అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 277 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తామని, ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు. ఏమైనా సందేహాలు ఉంటే 040 - 23328266, 23322377 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.

Advertisement

Next Story