- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BC Commission: రిజర్వేషన్లకు బీసీ కమిషన్ కసరత్తు.. ఆ సంఘాలతో వరుస భేటీలు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన ప్రక్రియలో భాగంగా స్టేట్ బీసీ కమిషన్(BC Commission) జిల్లాల పర్యటనకు సోమవారం నుంచి శ్రీకారం చుడుతున్నది. మొత్తం పది ఉమ్మడి జిల్లాల్లో కుల, ప్రజా సంఘాల ప్రతినిధులతో పాటు వివిధ సెక్షన్ల ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నది. వచ్చే నెల 8వ తేదీ వరకు సమావేశాలను నిర్వహించనున్నది. తొలి విడతగా ఆదిలాబాద్(Adilabad) జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ప్రజలు వెలిబుచ్చే అభిప్రాయాలను కమిషన్ రికార్డు చేసుకోనున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రాజకీయ వెనకబాటుతనాన్ని అధ్యయనం చేసి జనాభా లెక్కలకు అనుగుణంగా రిజర్వేషన్లను ఖరారు చేయడానికి కమిషన్ చేస్తున్న కసరత్తులో భాగంగా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నది.
ఈ ప్రోగ్రామ్‌పై కమిషన్ చైర్మన్ నిరంజన్ మూడు రోజుల క్రితమే రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌కు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్‌ను ఖరారు చేసిన తర్వాతనే ఎన్నికలను నిర్వహించాలని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఆ సామాజికవర్గాల ఓటర్ల వివరాలతో పాటు రాజకీయ వెనకబాటుతనంపైనా అద్యయనం జరపాలని షెడ్యూలును తయారు చేసుకున్నది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కులాలవారీగా సమగ్రంగా వివరాలు సేకరించనున్నది. వచ్చే నెల 8వ తేదీ వరకు తొమ్మిది జిల్లాల్లో పర్యటించేలా షెడ్యూలు ఖరారు కాగా దీపావళి పండుగ సందర్భంగా అక్టోబరు 31న, నవంబరు 3న ఆదివారం, నవంబరు 6న విరామం ఇవ్వనున్నది. తొమ్మిది జిల్లాల్లో పర్యటనలు ముగిసిన తర్వాత నవంబరు 9, 10 తేదీల్లో బ్రేక్ తీసుకుని 12, 13 తేదీల్లో హైదరాబాద్‌లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కుల సంఘాలు, ఎన్జీవోలు, వ్యక్తుల నుంచి అభిప్రాయాలను తీసుకోనున్నది.
ఇదిలా ఉండగా బీసీ కమిషన్ జిల్లాల పర్యటన సందర్భంగా బీసీ సంఘాలంతా ఆ సమావేశాల్లో పాల్గొనాలని, స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయంగా పోటీ చేసే అవకాశాల గురించి వారి వాణిని వినిపించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాసగౌడ్ విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ సంఘాల ప్రతినిధులు వారి డిమాండ్లను మౌఖికంగా, రాతపూర్వకంగా కమిషన్‌కు అందజేయాలని కోరారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఫార్ములా ఖరారు కావడానికి ఈ సమావేశాలు కీలకమైనందున బీసీ మేధావులు, ఉద్యోగులు, విద్యార్థి, యువజన, మహిళా ప్రతినిధులు కూడా విస్తృతంగా పాల్గొని సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకోవాలని కోరారు.
బీసీ కమిషన్ షెడ్యూలు ఇలా :
అక్టోబరు 28 : ఆదిలాబాద్ (ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలు)
అక్టోబరు 29 : నిజామాబాద్ (నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు)
అక్టోబరు 30 : సంగారెడ్డి (మెదక్, సిద్దిపేట్, సంగారెడ్డి జిల్లాలు)
అక్టోబరు 31 : దీపావళి సందర్భంగా బ్రేక్
నవంబరు 1 : కరీంనగర్ (కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలు)
నవంబరు 2 : వరంగల్ (వరంగల్, హన్మకొండ, జనగాం, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలు)
నవంబరు 3 : ఆదివారం కారణంగా బ్రేక్
నవంబరు 4 : నల్లగొండ (నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాలు)
నవంబరు 5 : ఖమ్మం (ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు)
నవంబరు 6 : బ్రేక్
నవంబరు 7 : రంగారెడ్డి (రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాలు(
నవంబరు 8 : మహబూబ్‌నగర్ (మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాలు)
నవంబరు 9, 10 : బ్రేక్ (రెండో శనివారం, ఆదివారం కారణంగా)
నవంబరు 11 : హైదరాబాద్ (హైదరాబాద్ జిల్లా)
నవంబరు 12, 13 : హైదరాబాద్ (ఎన్జీవోలు, కులసంఘాలు, వ్యక్తులు...)