ధాన్యం కుప్పకు బతుకమ్మ చీర!

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-01 16:01:50.0  )
ధాన్యం కుప్పకు బతుకమ్మ చీర!
X

దిశ, కొత్తగూడ : బతుకమ్మ పండుగకు ప్రభుత్వము చీరెలు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా వివిధ రంగుల్లో పంపిణీ చేసిన బతుకమ్మ చీరెల్లో నాణ్యత కొరవడిందని పలు గ్రామాల్లో మహిళలు ఆరోపణలు చేస్తున్నారు. కోట్ల ప్రజాధనం వెచ్చించి పంపిణీ చేసిన చీరెలు రెండు మూడు సార్లు కూడా కట్టుకోలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ధాన్యం కుప్పలు తడవకుండా బతుకమ్మ చీరెలు కప్పుతున్నారు. కొత్తగూడ మండలంలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వర్షం నుండి ధాన్యం కాపాడు కోవడానికి బతుకమ్మ చీరలను వాడుతున్నారు. బతుకమ్మ చీరెలను పంపిణీ చేసి మూడు నెలలు కూడా దాటకముందే ఇలా ధాన్యం కుప్పలపై కప్పడం చర్చనీయాంశంగా మారింది. నాణ్యమైన చీరెలు వస్తాయని ఆశగా ఎదురుచూసిన మహిళలకు ఈ సారి నిరాశే ఎదురైంది. చీరలు నాసిరకంగా ఉండటంతో గతంలో నిరసనలకు దిగారు. చివరికి ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో కట్టుకోవాల్సిన చీరెలను కాస్త ఇలా ధాన్యం కప్పడానికి వాడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed