Bandi Sanjay: నేడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి.. బండి సంజయ్ ఎమోషనల్ ట్వీట్

by Shiva |
Bandi Sanjay: నేడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి.. బండి సంజయ్ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ తొలి తరం ఉద్యమ నేత కొండా లక్ష్మణ్‌ బాపూజీ (Konda Laxman Bapuji) జయంతి నేడు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన చేసిన కృషిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది. రాజకీయవేత్తగా, బహుభాషా కోవిదుడిగా బాపూజీ చూపిన మార్గం అందరికీ ఆదర్శనీయం. శుక్రవారం కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి సందర్భంగా.. తెలంగాణకు ఆయన చేసిన సేవలను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్మరించుకుంటూ తన ‘X’ (ట్విట్టర్) ఖాతాలో ఎమోషనల్ ట్వీట్ చేశారు.

‘క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న సమరయోధుడు బాపూజీ అని గుర్తు చేశారు. గైర్ ముల్కీ ఉద్యమంలో గర్జించిన ఏకైక తెలంగాణ వీరుడు ఆయనే అని కొనియాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పదవులను సైతం లెక్క చెయ్యని త్యాగధనుడు అతనొక్కడేనని అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమ మార్గదర్శి, బడుగు బలహీన వర్గాల చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నమస్సుమాంజలులు’ అంటూ బండి సంజయ్ (Bandi Sanjay) ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed