- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bandi Sanjay: నిమజ్జనం విషయంలో ఆంక్షలు పెట్టడం సరికాదు
దిశ, వెబ్‌డెస్క్: గణేష్ నిమజ్జనం(Ganapati Immersion) విషయంలో ఆంక్షలు పెట్టడం సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంక్షల వల్ల ప్రతీ ఏడాది భక్తులు అయోమయానికి గురవుతున్నారని తెలిపారు. రెండ్రోజుల ముందు ట్యాంక్‌బండ్(Tankbund)లో నిమజ్జనం వద్దంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. హిందూ పండుగలకు ఆటంకం కలిగించడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. కోర్టు తీర్పుపై తమకు గౌరవం ఉందని అన్నారు. నిమజ్జనంపై భక్తులకు అవగాహన కల్పించాలని కోరారు. మరోవైపు హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం అయ్యింది. ఉత్సవాలకు వచ్చే భక్తులకు, ప్రజలకు రవాణా పరంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం బస్సులు పెంచగా.. మెట్రో యాజమాన్యం కూడా సమయం పొడిగించింది. శాంతియుతంగా నిమజ్జనం జరిగేలా సహకరించాలని పోలీసులు భక్తులను కోరారు.