శామీర్‌పేటకు చేరుకున్న బండి సంజయ్.. గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు భారీ ఏర్పాట్లు

by Rajesh |
శామీర్‌పేటకు చేరుకున్న బండి సంజయ్.. గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు భారీ ఏర్పాట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా రాష్ట్రానికి చేరుకున్న బండి సంజయ్ శామీర్‌పేట్ వద్దకు చేరుకున్నారు. బండి సంజయ్‌కు ఘన స్వాగతం పలికి గజమాలతో బీజేపీ శ్రేణులు సత్కరించారు. బీజేపీ శ్రేణులతో కలిసి బండి బ్రేక్ ఫాస్ట్ చేశారు. అనంతరం సిద్దిపేట జిల్లా శనిగరం వద్దకు బండి సంజయ్ చేరుకుంటారు. బండి సంజయ్‌కు శనిగరం వద్ద అపూర్వ స్వాగతం పలికేందుకు కరీంనగర్ పార్లమెంటు బీజేపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు.

Advertisement

Next Story

Most Viewed