- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘‘గ్రూప్- 1 పరీక్షతో సహా TSPSC పరీక్ష పేపర్లన్నీ లీక్’’
దిశ, వెబ్‌డెస్క్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్‌ది లీకేజీ, ప్యాకేజీ, నిరుద్యోగుల డ్యామేజీ సర్కార్ అని బండి ఫైర్ అయ్యారు. గత ఏడాది అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్- 1 పరీక్షతో సహా టీఎస్పీఎస్సీ పరీక్షలన్నీ లీక్ అయ్యాయని ఆయన ఆరోపించారు. పేపర్ లీక్ చేసిన నిందితుడు ప్రవీణ్‌కు అత్యధిక మార్కులు వచ్చాయని అని అన్నారు.
ఎన్నో ఏళ్లగా ఇండ్లను వదిలేసి వచ్చి కష్టపడి చదువుతోన్న నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతారా అని ప్రభుత్వంపై మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులను తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మరో రెండు నెలల్లో జరిగే టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్లు కూడా సీఎం కేసీఆర్ టీమ్‌కు లీక్ అయ్యాయని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. సింగరేణి పరీక్ష పత్రాలు కూడా లీక్ అయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో సంచలనంగా మారిన పేపర్ల లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.