అలా చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్లే.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
అలా చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్లే.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం మీద విమర్శలు చేస్తే.. ఆకాశం మీద ఉమ్మేసినట్లే అని అన్నారు. ఆరు గ్యారంటీల(Six Guarantees)పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనవసరంగా కేంద్రంపై, బీజేపీ నేతలపై విమర్శలు చేయడం కాదు.. దమ్ముంటే ఆరు గ్యారంటీలపై ప్రభుత్వం బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌(BRS) జగన్నాటకం ఆడుతున్నాయని విమర్శించారు.

రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండినా ప్రభుత్వానికి పట్టింపు లేదని అన్నారు రైతు భరోసా ఇవ్వరు.. రుణమాఫీ(Runa Mafi) పూర్తి చేయరు.. పంట నష్టపరిహారం ఇవ్వరు. ఇదేనా కాంగ్రెస్ (Congress) మార్క్ రైతు సంక్షేమ రాజ్యమంటే? అని ప్రశ్నించారు. రాజకీయ నాయకుల స్టేచర్ గురించి కాదు.. రైతుల ఫ్యూచర్ ఆలోచించండి అని సూచించారు. అసెంబ్లీలో తక్షణమే రైతు సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకునే చర్యలు చేపట్టాలని కోరారు.

Next Story