ఆలయాలను ప్రభుత్వం బిజినెస్ సెంటర్లుగా మార్చింది

by Nagaya |
ఆలయాలను ప్రభుత్వం బిజినెస్ సెంటర్లుగా మార్చింది
X

దిశ, డైనమిక్ బ్యూరో : కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణలోని దేవాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారాయని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆలయాలను ప్రభుత్వం బిజినెస్ సెంటర్లుగా మార్చిందన్నారు. స్విట్జర్లాండ్ దావోస్ పర్యటనలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. యాదాద్రికి పెట్టిన ఖర్చును కేటీఆర్ పెట్టుబడి అన్నారని...యాదాద్రి హుండీకి రోజుకు రూ. కోటి విరాళాల రాబడి వస్తుందన్నారని మండిపడ్డారు. ఆలయాలను ప్రభుత్వం బిజినెస్ సెంటర్లుగా మార్చిందని...అందుకే బీఆర్‌ఎస్ ఖమ్మం సమావేశానికి ముందు హిందూ దేవాలయాన్ని పెట్టుబడి అవకాశంగా చూపించేందుకు ఇతర రాష్ట్రాల సీఎంలను కేసీఆర్ తీసుకువస్తున్నారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.

కాగా, దావోస్ పర్యటనలో కేటీఆర్ యాదాద్రి ఆలయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఇవాళ యాదాద్రి వంటి ఆలయాన్ని పునఃనిర్మాణం చేసి..దానికి రూ.1000, లేదా 1200 కోట్ల ఖర్చు పెడితే అది భవిష్యత్ మీద పెట్టిన పెట్టుబడి కాదా? అని అన్నారు. యాదాద్రికి రోజుకు రూ. కోటి హుండీ సంపద వస్తుంది. మరి అది పెట్టుబడి అవుతుందా? అప్పు అవుతుందా? అని అన్నారు. దీంతో, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 'దేవుడు మీద భక్తి ఉండి ఆలయ అభివృద్ధి చేయలే, హుండీలో వచ్చే ఆదాయం కోసమే పెట్టుబడి పెట్టినాం'అని ట్విట్టర్ వేదికగా మండిపడుతున్నాయి. ఇక బండి సంజయ్ విమర్శలపై కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed