బాల్క సుమన్ ఓ దద్దమ్మ.. చేతకాని నాయకుడు: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

by Shiva |
బాల్క సుమన్ ఓ దద్దమ్మ.. చేతకాని నాయకుడు: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: బాల్క సుమన్ చేతకాని దద్దమ్మ అని, ఆయన వలన గడిచిన పదేళ్లలో నిరుద్యోగులకు ఇంచు కూడా లాభం జరగలేదని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మండిపడ్డారు. సోమవారం ఆయన అసెంబ్లీలోని ఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల దొర కాలి కింద ఉండి సుమన్ నోరు మెదపలేదని అన్నారు. నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నా.. స్పందించలేదని ఫైర్ అయ్యారు. ప్రజా ప్రభుత్వంలో నోటిఫికేషన్లు, ఉద్యోగులు ఇస్తుంటే, ఇప్పుడు సుమన్ నిర్లక్ష్యంగా మాట్లాటడం విచిత్రంగా ఉందన్నారు. తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాల భర్తీ చేస్తున్నారని అన్నారు.

కానీ కేసీఆర్, కేటీఆర్ ఇచ్చిన అబద్దాల స్క్రిప్ట్‌ను బానిస సుమన్ బీఆర్ఎస్ భవన్‌లో కూర్చొని చదువుతున్నాడని మండిపడ్డారు. సీఎం రేవంత్ ‌రెడ్డి‌పై సుమన్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకముందే బడిత పూజ చేయడం ఖాయమన్నారు. దేహశుద్ధి చేస్తారని బాల్క సుమన్ ఉస్మానియా యూనివర్సిటీ వైపు వెళ్లడం లేదని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో గ్రూప్-1 పేపర్లను పల్లీలు, కిల్లీ దుకాణాలకు అమ్ముకున్నారని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చాక యువతను కేసీఆర్ మోసం చేశాడని అన్నారు. కానీ, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశామన్నారు. అప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న పరీక్షల ఫలితాలకు ఉన్న అడ్డంకులను తొలిగించి, ఫలితాలు విడుదల చేయటంతో పాటు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించామని గుర్తు చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకేసారి డీఎస్సీ వేసి 7,857 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే, కొత్త ప్రభుత్వం కేవలం పది నెలల వ్యవధిలోనే 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ 2024 నిర్వహించిందన్నారు. జులైలో పరీక్షలు నిర్వహించి, రికార్డు వేగంతో సెప్టెంబర్ 30 వ తేదీన ఫలితాలను వెల్లడించిందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 9న ఎల్బీ స్టేడియంలో సగర్వంగా నియామక పత్రాలను అందజేయబోతున్నామని వివరించారు. గడిచిన 15 రోజుల్లోనే మెడికల్ అండ్ హెల్త్ బోర్డు 3,967 పోస్టుల నియామకానికి వరుసగా మూడు భారీ నోటిఫికేషన్లు జారీ చేశామని తెలిపారు. సెప్టెంబర్ 11న 1,284 ల్యాబ్ టెక్నిషియన్, సెప్టెంబర్ 18న 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టులు, సెప్టెంబర్ 24న 633 ఫార్మసిస్ట్ (గ్రేడ్-2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు.

రెసిడెన్షియల్ సొసైటీల పరిధిలో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులన్నీ కలిపి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 8,304 మందికి నియామక పత్రాలను అందించిందని గుర్తు చేశారు. టీజీపీఎస్సీ 26 వివిధ నోటిఫికేషన్ల ద్వారా దాదాపు 17,341 ఉద్యోగ నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయని, వీటిలో ఇప్పటికే కొందరికీ నియామక పత్రాలు అందించామన్నారు. ఇటీవలే, ఇరిగేషన్ విభాగంలో 687 మంది ఏఈఈలకు సీఎం రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు అందించారని తెలిపారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల పరిధిలో ఎంపికైన 1,650 మందికి అక్టోబర్ 6న ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందజేశార పేర్కొన్నారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన గ్రూప్-4 ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించిందన్నారు.

8,180 పోస్టుల నియామకాలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. సంక్షేమ శాఖలలోని 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులు, 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలు వెలువడ్డాయని పేర్కొన్నారు. గతంలో పేపర్ లీకేజీతో గందరగోళంగా మారిన గ్రూప్-1 పరీక్షను కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసి, 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించగా.. 3,02,172 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైతే, నెల రోజుల్లోనే జులై 7న ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించింద అన్నారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో 2022లో నిర్వహించిన 16,929 మంది కానిస్టేబుల్ పోస్టుల ఫలితాలను కూడా గత ప్రభుత్వం వెల్లడించ లేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story