‘నీకోసం ఇంటిదగ్గర ఎదురుచూస్తున్నాం నాన్న.. తొందరగా రా’

by Gantepaka Srikanth |
‘నీకోసం ఇంటిదగ్గర  ఎదురుచూస్తున్నాం నాన్న.. తొందరగా రా’
X

దిశ, నల్లగొండ క్రైం: ‘‘నాన్న.. నీకోసం మేము ఇంటిదగ్గర ఎదురుచూస్తున్నాం. నువ్వు తొందరగా ఇంటికి రా నాన్నా. మద్యం తాగి, ఆ మత్తులో వాహనం నడపొద్దు. నీకోసం అమ్మ వంట తయారు చేస్తోంది. ఇంకో పదినిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు.. క్షేమంగా ఇంటికి రా నాన్నా..! అందరం కలిసి భోజనం చేద్దాం. నువ్వు మద్యం తాగి లేటుగా వచ్చే సమయంలో.. ఏదైనా ప్రమాదం జరిగితే మేము ఏమైపోవాలి నాన్నా, మా భవిష్యత్ నీ చేతిలోనే ఉన్నది.. నీ క్షేమమైనా రాకపై ఉన్నది.’’ అని వాహనదారుల్లో అవగాహన కల్పించేలా నల్లగొండ ట్రాఫిక్ పోలీసులు పోస్టర్లు పెట్టారు. ట్రాఫిక్ సీఐ డి.రాజు, తన సిబ్బందితో కలసి నల్లగొండ ప్రధాన చౌరస్తాల్లో చూడగానే మనసుకరిగిపోయేలా అవగాహన బోర్డులను ఏర్పాటు చేసి, వాహనదారుల మన్ననలు పొందుతున్నారు.

Advertisement

Next Story