సచివాలయంలో ఫైర్ సేఫ్టీపై అవగాహన

by karthikeya |
సచివాలయంలో ఫైర్ సేఫ్టీపై అవగాహన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫైర్ సేఫ్టీ, ప్రమాదాల నివారణపై ఎస్పీఎఫ్ సిబ్బందికి అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం సచివాలయంలోని అసిస్టెంట్ డిస్ట్రిక్ ఫైర్ ఆఫీసర్ జీవీ ప్రసాద్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు జన్య, ఎ.యాదయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రాథమిక అగ్నిమాపక అవగాహన, ఫైర్ ఎక్స్‌ టింగ్విషర్లు/ఫిక్స్‌డ్ ఫైర్ ఇన్‌స్టాలేషన్‌లను ఎలా ఉపయోగించాలనే అంశాన్ని వివరించారు. ఫైర్ సేఫ్టీ నివారణతో సహా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ప్రజలను తరలించే విధానాల గురించి అగ్నిమాపక అధికారులు ఎస్పీఎఫ్ సిబ్బందికి తెలిపారు. బ్రొంటో స్కై లిఫ్ట్ ద్వారా టెర్రస్ నుంచి ఎలా కాపాడుకోలనే విధానం గురించి, శ్వాస వ్యాయమాలు, కృత్రిమ శ్వాసక్రియతో కూడిన పద్ధతిని సిబ్బందికి వివరించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ దేవదాస్, ఎస్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed