ఈఎస్ఐసీ, ఈపీఎఫ్ఓపై చందాదారులకు అవగాహన సదస్సు

by sudharani |
ఈఎస్ఐసీ, ఈపీఎఫ్ఓపై చందాదారులకు అవగాహన సదస్సు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈఎస్ఐ అందిస్తున్న ప్రయోజనాలను కార్మికులు, ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఈఎస్ఐసీ బ్రాంచ్ మేనేజర్ కె.వాసంతి అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని సహకార బ్యాంక్‌లో ఈఎస్ఐసీ, ఈపీఎఫ్ఓ ఆధ్వర్యంలో సువిధ సమగం, నిధి ఆప్కా నికట్ అనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఆమె.. ఈఎస్ఐ, పీఎఫ్ చందాదారులకు ఈఎస్ఐపీఎఫ్ ప్రయోజనాలను వివరించారు. ఈఎస్ఐలో ప్రధానమైన అస్వస్థ ప్రయోజనం(S.B), వైకల్య ప్రయోజనము(TDB,PDB), ఉద్యోగ పరమైన గాయం ప్రయోజనము(DB), ప్రసూతి హిత లాభం(metarnity benefit) అనే ఐదు అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే మెడికల్ బెనిఫిట్, సూపర్ స్పెషాలిటీ బెనిఫిట్, ఏబీవీకేవై, ఆర్జీఎస్కేవై ఈఎస్ఐ చందాదారులకు ప్రయోజనాలు చేకూరుస్తుందని వాసంతి తెలిపారు.

పీఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ పీఎఫ్‌పై చందాదారులకు దాని ప్రయోజనాలను వివరించారు. ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి, లోన్లు తీసుకోవడం, ఖాతాలను చెక్ చేసుకోవడం, ఈకేవైసీ చేసుకోవడంపై క్షణ్ణంగా వివరించారు. పీఎఫ్ చందాదారుల సందేహాలను, సమస్యలను పరిష్కరించే మార్గాలను నివృత్తి చేశారు. ఈ సదస్సులో ఆయా శాఖల సిబ్బంది రేణుక, పూల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed