- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Stray Dogs : కరీంనగర్‌లో వీధికుక్కల దాడి.. వీడియో వైరల్.. ఎక్స్‌లో మంత్రి ఆదేశాలు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో వీధి కుక్కల బెడద రోజురోజుకు పెరుగుతుంది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా పలు పట్టణాలు, గ్రామాల్లో సైతం వీధి కుక్కల బెడద పెరిగింది. ఇటీవల వీధి కుక్కుల బారిన పడి పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. దీంతో వీధి కుక్కుల బెడదతో చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా కరీంనగర్‌లోని 53వ డిజిజన్‌లో ఒక చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేయడానికి ప్రయత్నించాయి. అదే సమయంలో చిన్నారితో పాటు ఓ మహిళ ఉన్నా కూడా.. ఇద్దరిపై నాలుగు వీధి కుక్కలు దాడికి ప్రయత్నించాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే వీధి కుక్కలను తరిమేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ వీడియోను ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా జిల్లా కలెక్టర్, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు షేర్ చేశారు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలోనే ఆయన అధికారులను అప్రమత్తం చేశారు. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, కరీంనగర్ కలెక్టర్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను ఆదేశించారు.