Etala : ఆసైన్డ్ భూములు సీఎం జాగీరు కాదు : ఈటల ఫైర్

by Y. Venkata Narasimha Reddy |
Etala : ఆసైన్డ్ భూములు సీఎం జాగీరు కాదు : ఈటల ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : కుత్బుల్లపూర్ నియోజకవర్గం దుండిగల్(Dundigal) గ్రామంలో అసైన్డ్ భూముల(Assigned lands) ను ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తుందంటూ బాధిత రైతులు చేపట్టిన ఆందోళన(Agitation by farmers) లో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్( Malkajigiri BJP MP Etala Rajender) పాల్గొని సంఘీభావం ప్రకటించారు. దుండిగల్ గ్రామంలో సర్వే నెంబర్ 453, 454 లలో ఉన్న లావోని పట్టా 450 ఎకరాల భూమిలో కొంత భూమిలో డబల్ బెడ్లు నిర్మించారు. మిగతా 410 ఎకరాల్లో ఉన్న రైతులకు ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వకుండా తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే సర్వే నంబర్లలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 600 మందికి 60 గజాల ఇందిరమ్మ పట్టాలు కూడా ఇచ్చిందని, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ భూమికి పట్టాలు ఇప్పిస్తామని రేవంత్ రెడ్డి హామీ కూడా ఇచ్చారనీ.. ఇప్పుడు లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారనీ రైతులు ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న ఎంపీ ఈటల రాజేందర్ రైతుల ఆందోళన వద్దకు వెళ్ళి మాట్లాడారు.

రైతులకు అండగా నిలుస్తామని భరోసా నిచ్చారు. ఈ భూముల్లో 40 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నారని, ఇష్టం వచ్చినట్టు భూముల్ని తీసుకోవచ్చని అధికారులు మాట్లాడుతున్నారని, కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇలానే చేసి నాశనం అయ్యిందని గుర్తు చేశారు. అసైన్డ్ భూములను ఇష్టం వచ్చినట్లు లాక్కొనే అధికారం ఎవరికి లేదని, రింగ్ రోడ్డు అప్పుడు కూడా ఇలానే అసైన్మెంట్ భూములను రూపాయి ఇవ్వకుండా గుంజుకుంటుంటే రాజశేఖర్ రెడ్డితో కొట్లాడినమని తెలిపారు. పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు కూడా నష్టపరిహారం ఇచ్చేవరకు వదిలిపెట్టబోమన్నారు. ప్రభుత్వానికి అవసరమైతే అదికూడా ప్రజలకోసం అయితే నష్టపరిహారం ఇచ్చి తీసుకోవాలేగాని, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాదని మండిపడ్డారు.

భూములు గుంజుకుంటె చూస్తూ ఊరుకునేది లేదని, పేదలను వేధించే అధికారం ఎవరికీ లేదని, వారికి ఎవరూ దిక్కులేదు అని అనుకోవద్దని హెచ్చరించారు. ఈ భూములు అమ్ముకుంటే రెస్యూమ్ చేయండని, కానీ గుంజుకుంట అంటే ఊరుకునేది లేదంటూ అధికారులపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దల్లాగా వచ్చి ప్రజల్ని అదరగొట్టి బెదరగొట్టి పోలీసుల సహాయంతో పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే మంచిగా ఉండదని, నేను ఇక్కడ ఎంపీగా ఉన్నానని, అసైన్డ్ భూములు ఒక్క సంవత్సరం కోసం ఇవ్వరని, తాత జాగీర్ లాగా ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని హెచ్చరించారు. బాధిత రైతుల తరఫున నేనే కోర్టుకు పోతానన్నారు. దద్దమ్మల లెక్క ఉంటే గద్దల లెక్క తనకు పోతారని, అనేక రాష్ట్రంలో15 ఏళ్లు దాటిన తర్వాత అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కులు ఇచ్చేస్తారని, తమిళనాడు, యూపీలో ఇచ్చారని, సీఆర్ కూడా ఇస్తానని ఇవ్వలేదన్నారు. కడు బీదరికంలో ఉన్నవారికి భూమి ఇచ్చారని, రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా వ్యవహరించమని కాదు మీకు ఓట్లు వేసిందని ఈటల ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.

Advertisement

Next Story

Most Viewed