- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Assembly: ఫేక్ వీడియోలపై చర్యలు తీసుకోండి.. మంత్రి పొన్నం ప్రభాకర్
దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో కొందరు అతిగా ప్రవర్తిస్తున్నారని, దయచేసి వారిపై చర్యలు తీసుకోవాలని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రిప్లై ఇస్తూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ చెప్పినట్లుగా రాష్ట్రంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు ఇబ్బందేమీ లేదని, కానీ సమాజిక మాధ్యమాల్లో కొందరు ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవద్దు అంటే ఎలా అని ప్రశ్నించారు. నిన్న సభలో సహచర సభ్యుడితో మాట్లాడుతున్న సమయంలో వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టారని, ఇది ఒక్కటే కాదు.. గిరిజన మహిళా మంత్రిపైనా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని చెప్పారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోకుంటే ఎలా అని మండిపడ్డారు.
గత ప్రభుత్వంలో కూడా మా కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేఖించినందుకు కేసులు ఎదుర్కొన్నారని చెప్పారు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ఫేక్ వీడియోలు పెడుతున్నారని, అలా మహిళలను కించపరిచే విధంగా పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అంతేగాక సభా కార్యక్రమాలపై ఫేక్ వీడియోలు పెట్టి అవమానపరుస్తున్నారని, సోషల్ మీడియాలో ఎదుటి వ్యక్తిని కించపరిచే విధంగా ఉంటున్నాయనే విషయాన్ని చైర్ దృష్టికి తీసుకొస్తున్నానని చెప్పారు. సభలో జరిగిన అంశాలపై బయటకి వీడియోలు పెట్టి కించపరుస్తున్నారని, సభా కార్యక్రమాలను ఉల్లంఘిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం కోరారు.
Cm Revanth Reddy: ఇకపై వారికి కూర్చునే హక్కు!.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సానుకూల ప్రకటన