Assembly : తెలంగాణ ప్రయోజనాల కోసమే విభజన చట్టం.. : కేంద్రంపై భట్టి ఫైర్

by Rajesh |
Assembly : తెలంగాణ ప్రయోజనాల కోసమే విభజన చట్టం.. : కేంద్రంపై భట్టి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: విభజన చట్టం చేసిందే తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు అని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులపై జరిగిన చర్చలో భట్టి మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలకే కొందరు ఆలోచించారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాలను వదిలేయాలని సూచించారు. వెనకబడిన తెలంగాణ అభివృద్ధి చెందేలా విభజన చట్టంలో ఎన్నో అంశాలు పెట్టారన్నారు. విభజన చట్టంలోని అంశాల గురించి కేంద్రాన్ని ఎన్నోసార్లు అడిగామని గుర్తు చేశారు.

పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే ఇవ్వలేదన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ అడిగితే ఇవ్వలేదన్నారు. ఐటీఐఆర్, ఎయిమ్స్, నవోదయ విద్యాలయాలు అడిగితే ఇవ్వలేదని తెలిపారు. మెట్రో విస్తరణకు సైతం మొండి చేయి చూపారని పేర్కొన్నారు. రాష్ట్రాల పట్ల కేంద్రంలోని బీజేపీ వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ వైఖరి సమాఖ్య స్ఫూర్తికి ప్రమాదకరంగా మారిందని భట్టి ఫైర్ అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వ వివక్షపై చాలా రాష్ట్రాల్లో చర్చ జరుగుతోందన్నారు.

సింగరేణి కోల్ బ్లాక్స్ వేలం పాట పెట్టడానికి బీఆర్ఎస్సే కారణం..

ఇక, బీఆర్ఎస్ గత పాలనపైనా భట్టి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏడు మండలాల విలీనంపై బీఆర్ఎస్ ది తప్పుడు ప్రచారం అన్నారు. 7 మండలాల విలీనం మాట లేకుండానే రాష్ట్ర విభజన బిల్లు పాసైందని గుర్తు చేశారు. లక్షలాది ఎకరాలు మునగడానికి కారణం బీఆర్ఎస్ అన్నారు. ఏడు మండలాల కోసం బీఆర్ఎస్ ఎలాంటి పోరాటమూ చేయలేదని భట్టి సీరియస్ అయ్యారు. సీతారామ ప్రాజెక్ట్‌ను కట్టింది బీఆర్ఎస్ కాదన్నారు. సింగరేణి కోల్ బ్లాక్స్ వేలం పాట పెట్టడానికి కారణం బీఆర్ఎస్సే అన్నారు. వేలంపాటలో తాను పాల్గొన్నానని.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పినట్లు క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed