హైడ్రాపై అసదుద్దీన్ ఫైర్

by karthikeya |   ( Updated:2024-10-07 03:53:27.0  )
హైడ్రాపై అసదుద్దీన్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా కూల్చివేతలపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు (సోమవారం) నిర్వహించిన ఓ సభలో మాట్లాడిన ఆయన.. తెలంగాణ సచివాలయం కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఉందని, దేశంలోని ప్రముఖుల సమాధులన్నీ ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయని, చివరికి బాపూఘాట్ కూడా ఎఫ్‌‌టీఎల్ పరిధిలోనే ఉందని, ఇవన్నీ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నప్పుడు పేదల ఇళ్లు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. పేదల ఇళ్ల కూల్చివేతపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. 2013లో కాంగ్రెస్ తెచ్చిన భూచట్టం ప్రకారం కూల్చివేతలపై సర్కార్ ముందుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతలపై కాకుండా ముందుగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి సారించాలని హితవు పలికారు.

ఇదిలా ఉంటే హైడ్రాపై అసదుద్దీన్ ఓవైసీ ఇంతకుముందు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం, నెక్లెస్‌రోడ్‌‌తో పాటు అనేక ప్రభుత్వ భవనాలు ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఉన్నాయంటూ ఓ నెల క్రితం కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భవనాల పరిస్థితేంటని ప్రభుత్వన్ని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed