గుడ్ న్యూస్: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు ఆంక్షలు లేనట్టే..!

by Satheesh |   ( Updated:2022-12-26 02:51:40.0  )
గుడ్ న్యూస్: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు ఆంక్షలు లేనట్టే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా న్యూఇయర్​ఈవెంట్లకు ఈ సారి ఎలాంటి బ్రేకులు లేవు. సెలబ్రేషన్స్‌కు ఆంక్షలు విధించే ఆస్కారమే లేదు. న్యూఇయర్‌కు ఆంక్షలు విధిస్తున్నట్లు గత మూడు రోజులుగా సోషల్​మీడియాల్లో విస్తృతంగా జరుగుతున్న ప్రచారానికి చెక్​పడింది. ప్రస్తుతానికి కరోనా ప్రభావం లేనందున సర్కార్​ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోన్నది. ఇతర దేశాల్లో కరోనా విజృంభిస్తున్నదని వస్తున్న వార్తలతో అలర్టైన సర్కార్, వైద్యశాఖ, ఇతర ముఖ్య అధికారులతో ఇటీవల ఓ సమావేశాన్ని నిర్వహించింది. కరోనా వ్యాప్తితో న్యూ ఇయర్ ఎఫెక్ట్ అంశంపై సర్కార్ ఆరా తీయగా, ఎలాంటి టెన్షన్ లేదని హెల్త్​డిపార్ట్మెంట్​తేల్చి చెప్పింది. ఇతర దేశాల్లోని పరిస్థితులను మనకు ఎట్టి పరిస్థితుల్లో రావని వైద్యశాఖ నొక్కి చెప్పింది. దీంతో కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్‌కు ఆంక్షలు అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నది. కానీ వ్యక్తిగత భద్రత కోసం మాస్కులు ధరించి సెలబ్రేషన్స్‌లో పాల్గొనాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే ప్యూచర్‌లో కేసుల తీవ్రతను బట్టి పరిశీలించాల్సి ఉంటుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

జిల్లాల్లో జీరో..

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 జిల్లాల్లో గడిచిన మూడు నెలలుగా జీరో కేసులు నమోదవుతున్నాయి. న్యూ ఇన్​ఫెక్షన్లు కూడా తేలడం లేదు. దీంతో సెలబ్రేషన్స్‌తో నష్టం లేదని ఆరోగ్యశాఖ సర్కార్‌కు వివరించింది. పైగా ఇప్పటికీ ఓవరల్‌గా స్టేట్​లో సగటున పది నుంచి పదిహేను కేసులు మించి తేలడం లేదు. అవి కేవలం గ్రేటర్​హైదరాబాద్​ జిల్లాల్లోనే నిర్ధారణ అవుతున్నాయి. బాధితులంతా మైల్డ్ సింప్టమ్స్ తో చికిత్స తీసుకొని, రెండు మూడు రోజుల్లోనే నార్మల్​ స్టేజ్​కు వచ్చేస్తున్నారు. దీంతో స్టేట్​ లో సాధారణ సిచ్వేషనే ఉన్నదని ప్రభుత్వం గ్రహించింది.

గ్రూప్ ​గేదర్స్..

సహజంగానే కొత్త సంవత్సరం ప్రారంభానికి ప్రతీ ఏడాది నిర్వహించే స్పెషల్​ ఈవెంట్స్, పార్టీలలో గ్రూప్​ గేదరింగ్స్ ఎక్కువగా జరుగుతాయి. పార్టీలు, బార్లు, పబ్‌, స్టార్​హోటళ్లు, ఫంక్షన్​హాల్స్‌లో పెద్ద ఎత్తున జన సమూహాలు ఏర్పడతారు. దీంతో వైరస్ వ్యాప్తి జరిగే ప్రమాదం ఉన్నది. కానీ మన రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు వ్యాక్సినేషన్​పూర్తి చేసుకోవడం, వైరస్​వచ్చిపోవడంతో ఆటోమెటిక్‌గా ఏర్పడే ఇమ్యూనిటీ ఎక్కువ మందిలో ఉంటుందని ప్రభుత్వం భావన. పైగా గత సంవత్సరంతో పోల్చీతే ప్రస్తుతం కరోనా కేసులు అతి స్వల్పంగా ఉన్నాయి. దీంతో వ్యాప్తికి అవకాశం తక్కువేనని హెల్త్ ఎక్స్​పర్ట్స్​చెబుతున్నారు. ఒక వేళ ఇతర దేశాల్లో ఉన్న వేరియంట్​ ఇక్కడ ప్రబలినా..సీరియస్​ పరిస్థితులు రావని చెబుతున్నారు. మైల్డ్​ సింప్టమ్స్​ తోనే తగ్గిపోతుందని వివరిస్తున్నారు. దీంతో ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆరోగ్యశాఖ చెబుతున్నది.

అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది: హరీష్​ రావు, ఆరోగ్యశాఖ మంత్రి

"కొత్త వేరియంట్లపై ఆందోళన అవసరం లేదు. అవి మన రాష్ట్ర ప్రజల ఇమ్యునిటీని ప్రభావితం చేసి నిలబడలేవని సైంటిస్టులు, డాక్టర్లు చెబుతున్నారు. పైగా ఎక్కువ మందిలో వ్యాక్సినేషన్​ జరిగింది. ఒక వేళ న్యూ వేరియంట్‌లు సోకినా మైల్డ్​సింప్టమ్స్‌తో వచ్చి తగ్గిపోతుందని డాక్టర్లు అధ్యయనాలు చెబుతున్నారు. దీంతో వ్యాక్సిన్​వేసుకోవడంతో పాటు వ్యక్తిగత రక్షణ కొరకు మాస్కు ధరిస్తే సరిపోతుంది."

Also Read...

HYD: నేడు రాష్ట్రపతి ముర్ము రాక.. స్వాగతం పలకనున్న సీఎం కేసీఆర్

Advertisement

Next Story

Most Viewed