- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమ మద్యం పట్టివేత.. వెంటనే విడుదల.. అధికారులపై మండిపడుతున్న ప్రజలు..
దిశ, నేలకొండపల్లి: ఎక్సైజ్ అధికారులు మండలంలోని పలు గ్రామాల్లో బెల్టు షాపుల్లో అక్రమంగా అమ్ముతున్న మద్యాన్ని భారీగా పట్టుకున్నారు. బుధవారం మండల పరిధిలోని రాయిగుడెం, మంగాపురం తండా, కట్టు కాచరం, అప్పల నర్సింహాపురంలలో గొలుసుకట్టు దుకాణాల వద్ద అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. గ్రామాల్లో బెల్టు షాపుల్లో అక్రమ మద్యం ఉన్నట్లు గుర్తించిన ఎక్సైజ్ సీఐ విజేందర్ ఆదేశాలతో ఎస్ఐ శంకర్ పట్టుకొని వెంటనే నేలకొండపల్లి ఎక్సైజ్ ఠాణాకు తరలించారు. కానీ వెంటనే సీఐ విజేందర్ సంబంధిత బెల్టు షాపులు వారికి తిరిగి మద్యాన్ని అప్పగించారు. గ్రామాల్లో విచ్చలవిడిగా వెలసిన బెల్టు షాపులపై కొరడా జులిపించినట్లే గ్రామాల్లో కలరింగ్ ఇచ్చి, ఎక్సైజ్ పోలీసులు వెంటనే తిరిగి ఆ మద్యాన్ని గొలుసుకట్టు దుకాణదారులకు అప్పజెప్పడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. మొదటి తప్పుగా వదిలేశారా? లేక ఏదైనా ఒప్పందాలు కుదుర్చుకున్నారా? అని గ్రామస్తులు, మహిళలు మండిపడుతున్నారు. దీనిపై 'దిశ' సీఐ విజేందర్ ని వివరణ కోరగా పట్టుకున్న విషయం నిజమే కానీ, అది మొదటి తప్పుగా భావించి వదిలేసినట్లు చెబుతున్నారు. ఇంత భారీ మొత్తంలో పలు గ్రామాల్లో మద్యాన్ని పట్టుకొని గతంలో ఎన్నడూ కూడా వదిలేసిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఇలా జరగడంపై మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై ఉన్నతా అధికారులు విచారించాలని ఆయా గ్రామాల మహిళలు డిమాండ్ చేస్తున్నారు.