Arrest of Former Sarpanches: మాజీ సర్పంచ్‌ల అరెస్ట్.. ఆయా పీఎస్‌లకు తరలింపు

by Shiva |   ( Updated:2024-11-04 04:18:10.0  )
Arrest of Former Sarpanches: మాజీ సర్పంచ్‌ల అరెస్ట్.. ఆయా పీఎస్‌లకు తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: గత పదేళ్లుగా గ్రామ పంచాయతీల్లో (Village Panchayats) పేరుకుపోయిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాజీ సర్పంచ్‌లు (Former Sarpanches) ఇవాళ పోరుబాటుకు పిలుపునిచ్చారు. ఈ మేరకు వారంతా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)ని కలిసి వినతిపత్రం అందజేయాలని ఆదివారం రాత్రి నగరానికి చేరుకున్నారు. అయితే, వారు బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన పోలీసులు హోటల్‌ను వద్దకు చేరుకుని మాజీ సర్పంచులను బయటికి రాకుండా నిర్భంధించారు. కొంత మందిని అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు.

Advertisement

Next Story