వెల్లుల్లి కొంటున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త.. సిమెంట్ తో తయారు చేసిన వెల్లుల్లి అమ్ముతున్నారు ..!

by Maddikunta Saikiran |
వెల్లుల్లి  కొంటున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త.. సిమెంట్ తో తయారు చేసిన వెల్లుల్లి అమ్ముతున్నారు ..!
X

దిశ, వెబ్‌డెస్క్: మీరు వెల్లుల్లి కొంటున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త.. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మరీ కొనండి. ఇదివరకు నకిలీ కోడిగుడ్లు, నకిలీ బియ్యం, నకిలీ సబ్బులు, నకిలీ అల్లం పేస్ట్ మార్కెట్లో దర్శనమిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటుండగా తాజాగా వీటిలో నకిలీ వెల్లుల్లి వచ్చి చేరింది.మహారాష్ట్రకు చెందిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ సుభాష్ పాటిల్ ఇలాంటి నకిలీ వెల్లుల్లి రాకెట్‌ గుట్టు రట్టు చేశారు. తాను నకిలీ వెల్లుల్లి వల్ల మోసపోయానని గ్రహిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్ర అకోలాలోని బజోరీయా నగర్ లో సుభాష్ పాటిల్ అనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నివాసముంటున్నారు. ఒకరోజు తన ఇంటిముందుకు వచ్చిన వ్యాపారి వద్ద అతని భార్య వెల్లిపాయలు కొనుగోలు చేసింది. ఆమె ఇంటికి వచ్చి వాటిని ఓపెన్ చేసి చూస్తే చాలా గట్టిగ అనిపించాయి. దీంతో వెంటనే కత్తి తీసుకొని వాటిని కోయడం ప్రారంభించింది. అయినా కూడా వెల్లుల్లి గట్టిగానే అనిపించాయి. తరువాత వాటిని పూర్తిగా టెస్ట్ చేసి చూస్తే సిమెంట్ తో తయారు చేయబడినవి అని తేలింది. సిమెంట్, కలర్ తో మిక్స్ చేసి తయారు చేశారని తెలిసి షాక్ కి గురయ్యారు. దీంతో మోసపోయామని గ్రహించిన వారు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజలతో పంచుకున్నారు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కన్పిస్తున్న వెల్లిగడ్డను చూస్తే మామూలు వెల్లిగడ్డలానే కన్పించింది. అయితే వెల్లుల్లి ఒక పొర తీసి చూడగా లోపలి భాగమంతా సిమెంట్‌తో గట్టిగ నిండి ఉంది. ఇప్పుడు ఈ వీడియో చూసేవారికి షాక్‌ను కలిగిస్తున్నది. వెల్లిగడ్డ పై పొర మాత్రమే అలాగే ఉంచి లోపలంతా సిమెంట్‌ను నింపి మార్కెట్లోకి వదులుతున్నారు. సిమెంట్‌తో చేసిన నకిలీ వెల్లుల్లి అసలు స్టాక్‌లో కలిపి అమ్మేస్తున్నారని అనుమానిస్తున్నారు.దీంతో ఇక నుంచి వెల్లుల్లి కొనే వారు జాగ్రత్తగా చూసి కొనండి.

Next Story

Most Viewed