- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
సీఎం ఢిల్లీ పర్యటన కారణాలు ఇవేనా?
దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఈ నెల 16న ఢిల్లీ(Delhi)కి వెళ్లనున్నారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చించేందుకు ఈ ప్రయాణం ఉండనుందని సమాచారం. చాలరోజులుగా ఏఐసీసీ(AICC) పెద్దలు తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు సీఎంతో పాటు, పలువురు రాష్ట్ర సీనియర్ నేతలతో చర్చలు సాగిస్తున్నారు. అయితే నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో మరోసారి అధిష్టానం మంత్రివర్గ కూర్పుపై సమావేశం కానుంది. మంత్రివర్గ విస్తరణతో పాటు.. ఇప్పటికే సిద్దం చేసిన 27 నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన జాబితా, పీసీసీ కార్యవర్గ సభ్యుల ఎంపిక వంటి విషయాలపై నిర్ణయం తీసుకునేందుకు ఢిల్లీ పెద్దలు రేవంత్ రెడ్డికి కబురు పంపినట్టు రేవంత్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ గౌడ్, శ్రీధర్ బాబు లకు కూడా ఢిల్లీ నుండి పిలుపు వచ్చినట్టు సమాచారం. మరి ఈసారైనా మంత్రివర్గ విస్తరణ ఓ కొలిక్కి వస్తుందో లేదో పర్యటన తర్వాత తేలనుంది.