- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బండి సంజయ్ ఛాంబర్‌లో మరోసారి వాస్తు మార్పులు!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగో విడత పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అధికారం కోసం ఓ వైపు రాజకీయంగా ప్రయత్నాలు చేస్తునే మరోవైపు పార్టీ కార్యాలయంలో వాస్తు మార్పులు చేపట్టడం ఆసక్తిగా మారింది. ఇప్పటికే కార్యాలయం లోపలికి వెళ్లే ప్రధాన దర్వాజా వద్ద మార్పులు చేయగా తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఛాంబర్‌లో వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టారు. గతంలో అధ్యక్షుడు అయిన కొత్తలో కూడా బండి సంజయ్ తన ఛాంబర్‌లో వాస్తు మార్పులు చేయించారు. తాజాగా మరోసారి వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టడం ఆ పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వాస్తు నిపుణుల సలహాలు సూచనల మేరకు ఈ మార్పులు జరుగుతున్నాయనే చర్చ ఆ కలమం పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది.