- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో 37 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీ విజయం కోసం ప్రభుత్వం పకడ్బందీ ప్లాన్ వేసింది. టికెట్ ఆశిస్తున్న పలువురికి అసంతృప్తి కలగకుండా నామినేటెడ్ పదవులు కట్టబెట్టింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు రావడంతో కోడ్ చిక్కుల్లేకుండా వ్యూహాత్మకంగా వ్యహరించింది. దాదాపు 37 మందికిపైగానే ఈ జాబితాలో పేర్కొంది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ కార్పొరేషన్లతో పాటు కొత్తగా ఏర్పాటైనవాటిలో కూడా భర్తీ చేసింది. కాగా, ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనల ఆరోపణలు రాకుండా ఈ నెల 14వ తేదీనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు రాని ఆశావహులతో పాటు ప్రస్తుతం లోక్‌సభ రేసులో ఇబ్బంది రాకుండా ఉండేలా లీడర్ల ఎంపిక జరిగింది.
పార్టీలో చురుగ్గా పనిచేసినవారిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తించి వారికి ఈ పదవులను కట్టబెట్టారు. సూర్యాపేట నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించి చివరి నిమిషంలో అవకాశాన్ని కోల్పోయిన పటేల్ రమేశ్‌రెడ్డికి నామినేటెడ్ పోస్టు వరించింది. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా మల్‌రెడ్డి రాంరెడ్డి, టూరిజం డెవల్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పటేల్ రమేశ్ రెడ్డి, ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్ చైర్మన్‌గా నిర్మలా జగ్గారెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్‌గా నేరెళ్ల శారద, వైశ్య కార్పొరేషన్ చైర్మన్‌గా కాల్వ సుజాత, ఎస్‌సీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎన్. ప్రీతమ్ సహా మొత్తం 37 మందికి అవకాశం కల్పించారు. కింది లిస్ట్‌లో మొత్తం వివరాలు పేర్కొనడం జరిగింది.