- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీ వర్సెస్ తెలంగాణ.. సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇవాళ పోటాపోటీగా మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తున్నాయి. ఈ కాలేజీలను ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రులు వర్చువల్‌గా ఓపెన్ చేస్తున్నారు. తెలంగాణలో ఇవాళ 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వర్చువల్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ప్రారంభోత్సవం చేయనున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం చేయనున్నారు. విజయనగరం మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. అయితే ఈ కాలేజీలకు పెద్ద మొత్తంలో కేంద్రం నిధులు ఇచ్చిందని, లేదు రాష్ట్ర ప్రభుత్వాలే ఎక్కువ నిధులు సమకుర్చుకున్నదని నెట్టింట చర్చలు జరుగుతున్నాయి.